ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
1 min read– ప్రతి వాహనదారుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
–నిబంధనల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.
– ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేకదృష్టి సారించాం.
– నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
– వాహనదారుల భద్రత కోసమే పోలీస్‌శాఖ పనిచేస్తున్నదని ప్రజలు అర్థం చేసుకోవాలి…. పోలీసులకు ప్రజలు సహాకరించాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు.http://kurnoolpolice.in/trafficmitra/ TRAFFIC MITRA లో భాగంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రజలు, యువకులు పంపించిన ఫోటోల ఆధారంగా ఇప్పటివరకు 3,304 మంది పై ట్రాఫిక్ మిత్రకు ఫిర్యాదులు వచ్చాయి.కర్నూలు ట్రాఫిక్ పోలీసు విభాగం వారు నిర్ధారణ చేసి 204 మంది పై రూ. 1 లక్ష 24 వేల 646 /- జరిమానా విధించారు.గత వారం రోజులుగా (మార్చి 19 నుండి మార్చి 25 వరకు) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన లో భాగంగా డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 71 కేసులు.హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 2,242 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 77 కేసులు.జంపింగ్ సిగ్నల్ పై 6 కేసులు. ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 2,940 కేసులు.సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 217 కేసులు.అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 691 కేసులు. ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై 60 కేసులు. ట్రిపుల్ రైడింగ్ పై 296 మంది కేసులు, రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 103 కేసులు. రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 144 కేసులు. నంబర్ ప్లేట్ లేని 115 వాహనాలు సీజ్ , మొత్తం 5 లక్షల 45 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని 7,557 ఈ – చలనాలను (రూ. 13 లక్షల 90 వేలు) రికవరీ చేశామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు పాటిస్తూ గమ్యాలకు క్షేమంగా చేరాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.