నాణ్యమైన భోజనం.. అందివ్వకపోతే చర్యలు
1 min readపల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి : పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పెద్దవంగలి సర్పంచ్ బంగారు షరీఫ్ హెచ్చరించారు. శనివారం మండలం లోని పెద్దవంగలి లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మద్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు . విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని వడ్డించి , రుచి చూశారు . ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం వడ్డించాలన్నారు . విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వహకులకు సూచించారు . కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సంజీవరెడ్డి పాల్గొన్నారు .