NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్యకర్తలే మా బలం వారి సంక్షేమమే మాకు ముఖ్యం.. 

1 min read

పాణ్యం వైసీపీ టికెట్ మాదే…

పాణ్యం యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కార్యకర్తలను వారి సమస్యలను అడిగి తెలుసుకుని తీర్చడానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు  కాటసాని శివ నరసింహారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బలం ముఖ్యంగా కార్యకర్తలే. కార్యకర్తలను వారి  క్షేమమాచారాలు తెలుసుకొని  భరోసా ఇవ్వడం లక్ష్యంగా గత మూడు నెలల నుండి పాణ్యం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను కలుస్తున్నట్టు తెలిపారు కల్లూరు ఓర్వకల్ మండలాలలో కార్యకర్తలతో సమావేశాలు పూర్తయ్యాయని  సోమవారం నాడు గడివేముల మండలంలోని గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు  వైసీపీ పార్టీ పాణ్యం టికెట్ తమకే కేటాయిస్తుందని 2024 లో తమ తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ఆశాభవం వ్యక్తం చేశారు  నాన్న సీనియర్ పొలిటిషన్ అని గత 30 సంవత్సరాల నుండి కార్యకర్తలే బలంగా వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయని కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను తీర్చారన్నారు రాష్ట్రంలోని అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టును సాధించామన్నారు. అధిష్టానం దృష్టిలో మాకు నియోజకవర్గంలో ఎటువంటి వ్యతిరేకతలేదని సర్వేలో కూడా తేలిందని . కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుపు మాదేనన్నారు ప్రస్తుతానికి అయితే టికెట్ విషయం కంటే మా కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తమ లక్ష్యం అని తెలిపారు ఐదేళ్లకోసారి ఎన్నికల యుద్ధం తప్పదన్నారు ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు కింది స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author