PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాండ్ర కూతురు రిసెప్షన్ కు భారీగా తరలిన కార్యకర్తలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానంద రెడ్డి కూతురు రిసెప్షన్ కు మిడుతూరు మండలం నుండి టిడిపి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో శివానందరెడ్డి ఇంటిదగ్గర మరియు ఆప్రాంతమంతా అంగరంగ వైభవంగా డెకరేషన్ తో తీర్చిదిద్దారు.టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,మాజీ మండల అధ్యక్షులు గుండం నాగేశ్వర రెడ్డి,వివిధ గ్రామాల నాయకులు చెరుకుచెర్ల హరి సర్వోత్తమ్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,ఇద్రీస్,సర్వోత్తమ్ రెడ్డి,సుల్తాన్,ఇంతియాజ్,మాజీ సర్పంచ్ నాగేంద్రుడు,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి,గోకారి,శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

About Author