నటుడు ఉత్తేజ్ భార్య ఇకలేరు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ సీనియర్ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉత్తేజ్ ను మెగాస్టార్ చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్ రాజ్ పరామర్శించారు. ఉత్తేజ్ చిరంజీవిని పట్టుకుని బోరున విలపించారు.