PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ తోనే న‌టుడు వివేక్ మృతి: మ‌న్సూర్ సంచ‌ల‌న వ్యాఖ్య

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: క‌రోన వ్యాక్సిన్ కార‌ణంగానే న‌టుడు వివేక్ మృతి చెందార‌ని న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. వ్యాక్సిన్ వ‌ల్ల మ‌ర‌ణించ‌లేద‌ని ఎలా నిర్ధార‌ణ చేస్తారంటూ ప్రశ్నించారు. న‌టుడు వివేక్ భౌతిక‌కాయానికి నివాళి అర్పించిన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. క‌రోన పేరుతో ప్రజ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని అన్నారు. క‌రోనా లాంటి వైర‌స్ లు ఏళ్లుగా ఉన్నాయ‌ని అన్నారు. వివేక బాగున్నప్పటికీ వ్యాక్సిన్ ఎందుకు వేశార‌ని ప్రశ్నించారు. వ్యాక్సిన్ స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తుంద‌ని గ్యారెంటీ ఉందా అని అన్నారు. తాను ఎన్నిక‌ల ప్రచారంలో చెత్త కుప్పల ద‌గ్గర‌, బిచ్చగాళ్ల ద‌గ్గర కూర్చున్నానని, త‌న‌కు క‌రోన ఎందుకు రావ‌డంలేద‌ని అన్నారు. కరోన వ‌ల్ల ప్రజ‌లు తీవ్రంగా ఇబ్బందిప‌డుత‌న్నార‌ని, ప్రభుత్వం ప్రజ‌ల‌కు స‌హాయం చేయాలి కానీ.. ఇంకా భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని అన్నారు.

About Author