NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ‌నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు

1 min read


పల్లెవెలుగు వెబ్: యువకుడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ భూమిక. ఖుషి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చింది. ఆ తరువాత మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆపై స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. తరువాత కొంతకాలానికి యోగా టీచర్ భరత్ ఠాగూర్‌ని పెళ్లి చేసుకొని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పింది భూమిక.
ఇటీవల ఈ సీనియర్ హీరోయిన్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘ఎంసిఎ’, ‘సవ్యసాచి’, ‘పాగల్’, ‘సీటిమార్’ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన భూమిక….. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. తనకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదన్నది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయా..? నిర్మాతలతో ఎప్పుడు టచ్‌లో ఉండాలా..? అవన్నీ అవాస్తవాలు.. నన్నెవరూ అలాంటివి అడగలేదని భూమిక చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవల సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై పలువురు నటీమణులు..తమకు ఎదురైన అనుభవాలను బహిరంగంగానే వ్యక్తపర్చారు. అయితే భూమిక మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం.

About Author