పొగాకు పంటలను పరిశీలించిన ఏడిఏ
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలస్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశ కార్యక్రమము శుక్రవారం నిర్వహించారు. ఈసమావేశమునకు సలహామండలి సభ్యులు మరియు నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.విజయశేకర్ మరియు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరునాయక్ గ్రామ వ్యవసాయ సహాయకులు టి. అశోక్ పాల్గొన్నారు.అలాగే ఈసమావేశంలో రైతులకి పలు విషయాలపై తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.రైతులు శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాలు తొందరగా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే పీ రుసాహెబ్ పేట మరియు చౌట్కూరు గ్రామాల్లో పొగాకు, మిరప పంటలను పరిశీలించి రైతులకు సూచనలు తెలియజేశారు.పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు.