NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏడీఏ వీరారెడ్డి సేవలు మరువలేనివి : శాప్​ చైర్మన్​ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వ్యవసాయాధికారిగా పని చేసిన డా. చిన్న గంగన్నగారి వీరారెడ్డి రైతులకు చేసిన సేవలు మరువలేనివన్నారు శాప్​ చైర్మన్​ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. గురువారం పట్టణంలోని చాముండి ఫంక్షన్​హాల్​లో వ్యవసాయాధికారి డా. చిన్నగంగన్నగారి వీరారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాప్​ చైర్మన్​ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం రైతులకు పంటల సాగుపై పూర్తి అవగాహన కల్పించి…. వారి అభ్యన్నతికి ఏడీఏ వీరారెడ్డి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ,JDA వరలక్ష్మి, PD ATMA ఉమా మహేశ్వరమ్మ,AD హార్టికల్చర్‌ రగునాథరెడ్డి, నంద్యాల హార్టికల్చర్‌ రమణ, మార్కెట్‌యార్ఢ్‌ చైర్మన్‌ తువ్వా శివరామాక్రిష్ణారెడ్డి , మునిసిపల్‌ చైర్మన్‌ దాసి సుదాకర్‌రెడ్డి , నాయకులు చంద్రమౌళి, నాగిరెడ్డి , రైతు సంఘం నాయకులు,ఫర్టిలైజర్‌ పెస్టిసైడ్‌ షాపు యజమానులు నాయుడు , అధికారులు,అనదికారులు పాల్గొన్నారు.
ఏడీఏకు జర్నలిస్టుల సన్మానం:


నందికొట్కూరు ఏడీఏగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన గంగన్నగారి వీరారెడ్డిని జర్నలిస్టు యూనియన్​ నాయకులు ఘనంగా సత్కరించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో నందికొట్కూరు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు గుంపుల వెంకటేశ్వర్లు, నగేష్, జయరాజు, ఉసెనాలం ఏడీఏ ను సన్మానించారు.

About Author