PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరువు మండలాల కు అదనంగా 50 రోజుల పని దినాలు

1 min read

మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందు వేయుట కు చర్యలు తీసుకోండి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి..

జిల్లాలోని  మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలు గా ప్రకటించమని ప్రధాన కార్యదర్శిని కోరిన జిల్లా కలెక్టర్…

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ లతో వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల మీద సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.శుక్రవారం సాయంకాలం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో మరియు జాయింట్ కలెక్టర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్కీం లో ఇంటి పట్టాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలని ,మిస్సింగ్ అసైన్డ్ లాండ్స్ , డాటెడ్ లాండ్స్ పై సరైన చర్యలు తీసుకొని వాటిని ఫ్రీహోల్డ్ చేయవలసిందిగా , ఫేస్ -3 సర్వేలో స్టోన్ ప్లాంటేషన్ పనులు త్వరగా పూర్తి చేయించాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లను ఆదేశించారు.మహాత్మా గాంధీ ఉపాధి హామీ క్రింద అన్ని జిల్లాలు 100 రోజుల పని దినాల ను సద్వినియోగం చేసుకోవాలని , ప్రకటించబడిన కరువు మండలాలకు 50 రోజుల పని దినాలు అదనంగా కేటాయించడం జరిగిందని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన చీఫ్ సెక్రటరీ ని కర్నూలు జిల్లాలో మిగిలిపోయిన  మండలము లను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కు ఆరోగ్య శాఖ, వాలంటీర్లు , గ్రామ సచివాల సిబ్బంది సమన్వయంగా స్పాట్ టెస్టింగ్ లు జిల్లా మొత్తం చేయాలని , అవుట్ పేషంట్ల టోకెన్లు సంఖ్యను పెంచాలని , ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ కార్డుల వితరణ త్వరగా పూర్తి చేయాలని ,జగనన్న ఆరోగ్య సురక్ష లో రెఫర్ చేయబడ్డ రోగులకు  దారి ఖర్చుల నిమిత్తం 500 రూపాయలు ఇస్తున్న విషయం ప్రజలకు తెలియజెప్ప వలసిందిగాను,  వాహనాల ద్వారా ప్రజలను ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని , రెఫర్ చేయబడ్డ  వారికి కంటి ఆపరేషన్లు వెంటనే చేయించాలని , కంటి అద్దాలు కూడా పంపిణీ  చేయాలని కలెక్టర్లను ఆదేశించినారు.మార్చి నెల 3 వ తారీఖున పల్స్ పోలియో నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేసుకోవాలని కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష లో భాగంగా గుండె , మూత్రపిండాలు మొదలగు దీర్ఘవ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం చే మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఈ విషయం అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు.రీ సర్వే ,  ల్యాండ్ అక్విజిషన్ తదితర కార్యక్రమాల మీద కూడా ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు.వీసీ లో కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ మధుసూదన్ రావు , సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ రామ గిడ్డయ్య , ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు , డి ఎల్ డి ఓ ,సర్వే అధికారులు తదితరులు   పాల్గొన్నారు.

About Author