అమలాపురానికి అదనపు బలగాలు.. 144 సెక్షన్
1 min read
పల్లెవెలుగువెబ్ : అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు.