ప్రజా వినతులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించండి
1 min read
మండల స్థాయి స్పందనకు 672 దరఖాస్తులు
జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డిపల్లెవెలుగు వెబ్ బనగానపల్లి: ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మండల స్థాయి, సచివాలయ స్థాయి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం బనగానపల్లి ఎంపిడిఓ కార్యాలయ సమావేశ భవనంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తును తిరిష్కరించకుండా నిర్ణీత కాల పరిమితిలోగా ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత మండల స్థాయి, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పరిష్కరించలేని పక్షంలో వున్న నిబంధనలను అర్జీదారులకు సవివరంగా తెలియజేసి సంతృప్తి చెందే స్థాయిలో ఎండార్స్ చేసి ఇవ్వాలన్నారు. బనగానపల్లె మండలం లో ఇళ్ల పట్టాలు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బియాండ్ ఎస్ఎల్ఎ లోగా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ప్రతిరోజు 3 నుండి 5 గంటల వరకు సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు సూచించిన మూడు రిజిస్టర్ లలో సమస్యలను నమోదు చేయాలన్నారు. జిల్లా కేంద్రం నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన విచారణ జరిపి నివేదికలు పంపాలని జెసి ఆదేశించారు. బనగానపల్లి మండల స్థాయి స్పందనకు 672 కి పైగా దరఖాస్తులు వచ్చాయని వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి స్పందనలో కొన్ని వినతులు
1) బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెం తాండా గ్రామ కాపురస్తురాలు రత్నాభాయికి సలాం అలియాబాద్ గ్రామంలో సర్వే నంబర్ 30లో 3.60 సెంట్లు కలదని…. ఆ భూమిలో వైఎస్ఆర్ జలకళ కింద బోరు బావి వేసుకున్నానని, కరెంట్ కొరకు వోల్టా సర్టిఫికేట్ ఇప్పించగలరని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
2) బనగానపల్లె మండలం యాగంటిపల్లే గ్రామ వాస్తవ్యుడు మద్దిలేటి తనకు రెండు కాళ్ళు లేని కారణంగా వికలాంగ పెన్షన్ వచ్చెదని… ప్రస్తుతం నా కుమారునికి కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగం ఉన్నందువల్ల నా పెన్షన్ తొలగించారని… కావున నా మీద దయవుంచి నాకు వికలాంగ పెన్షన్ మంజూరు చేస్తారని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
3) బనగానపల్లె మండలం యాగంటిపల్లే గ్రామ కాపురస్తురాలు లక్ష్మీదేవి తన కుమారునికి పుట్టుకతో చేవి లేదని… సదరన్ క్యాంపులో 30% మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చారని… నా కుమారునికి ఇచ్చిన ఐడి నంబరును డిలీట్ చేయవలసినదిగా కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీవో వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో సుబ్బారెడ్డి ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.