PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించండి

1 min read

– డిఆర్ఓ నాగేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి అర్జీదారులకు తృప్తి కలిగేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లిఖార్జునుడు,అనురాధ, రమ తదితరులు ప్రజల నుండి అర్జీలుస్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. స్పందన అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా చూడాలన్నారు.ఏ అర్జీకూడా రీఓపెనింగ్‌కు ఆస్కారంలేకుండా పరిష్కరింపబడాలన్నారు. అర్జీలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. స్పందన అర్జీలు ఎట్టిపరిస్థితిలో పెండింగ్‌లో ఉండకూడదని, వచ్చినవి వచ్చినట్లు ఏ రోజుకారోజు పరిష్కరించాలని డిఆర్ఓ అన్నారు.స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు
1)మంత్రాలయం మండల కేంద్రంలోని ప్రజలు చంద్రన్న గౌడ్, మల్లికార్జున, బసవరాజు, కుమారస్వామి, తదితరులు మా గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు సర్వేనెంబర్ 257/5 లో 17 ఎకరాల నాలుగు సెంట్లు భూమి కలదు, ఈ దేవుని మాన్యంలో ఫంక్షన్ హాల్ నిర్మించుకొనుటకు ప్రభుత్వం నుండి అనుమతులు ఇప్పించాలని కోరుతూ గ్రామ ప్రజలు అర్జీ సమర్పించారు.2)పత్తికొండల మండలం నకలదొడ్డి గ్రామ ప్రజలు హనుమంతు, హుస్సేన్ అయ్య, రవికుమార్ తదితరులు మా గ్రామ పొలిమేరలు సర్వేనెంబర్ 366/2b నందు పరంబోగు ప్రభుత్వ భూమి కలదు ఇందులో స్మశానానికి భూమిని కేటాయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.3)ఓర్వకల్లు మండలం ఎన్ కొంతలపాడు గ్రామ నివాసి మాదిగ నాగమద్దిలేటి మాకు సర్వేనెంబర్ 505/1 లో ఒక ఎకరా భూమి కలదు ఈ భూమిని 1998వ సంవత్సరములో కొనుగోలు చేయడమైనది కానీ ఆన్లైన్లో నా పేరు నమోదు కాలేదు దయతో నా పేరును ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.4)వెల్దుర్తి మండల కేంద్రంలోని నివాసి ఏ.మల్లయ్య వెల్దుర్తి గ్రామ పొలిమేరలు సర్వే నెంబర్1226/1 లో ఒక్క ఎకరా 10 సెంట్లు భూమి కలదు, నేను ఆర్టీసీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను నాకు గొంతు క్యాన్సర్ వచ్చినది నా భూమిని అమ్ముకోవడానికి వెళ్తే చుక్కల భూమి అంటున్నారు, ఈ చుక్కల భూమిని అమ్ముకునే విధంగా అనుమతులు ఇప్పించగలరని కోరుతూ అర్జీ సమర్పించారు.

About Author