పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించండి
1 min read– ఏఐఎస్ఎఫ్ డిమాండ్.. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ
– హోళగుంద మండల వ్యాప్తంగా ఉన్న ఏక ఉపాధ్యాయ పాఠశాలలకు విద్యార్థులకు అనుకూలంగా ఉపాధ్యాయులను నియమించండి.ఏఐఎస్ఎఫ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ_ హోళగుంద మండలంలో పెద్దహ్యట కొత్తపేట తండా ప్రాథమిక పాఠశాలలకు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక ఏక ఉపాధ్యాయ పాఠశాలలో ఉన్నాయి. పని నిమిత్తం మండల కేంద్రానికి వస్తే అక్కడ మరో ఉపాధ్యాయులు లేక విద్యార్థులను ఇళ్లకు పంపించి తాళాలు వేసిన సంఘటనలు మన మండలంలో జరిగాయి. కాబట్టి మన మండలంలో ఏక ఉపాధ్యాయ పాఠశాలలో చాలానే ఉన్నాయి కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య అధికారులు స్పందించి ఏక ఉపాధ్యాయ పాఠశాలలకు విద్యార్థులకు అనుకూలంగా ఉపాధ్యాయులను నియమించాలని. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకులు నిర్వహించి మండల విద్య అధికారుల కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షులు రాజేష్ అజయ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్ వీరేంద్ర లింగేష్ తదితరులు పాల్గొన్నారు.