PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి కి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద :   గౌరవనీయులైన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ప్రకారము మరియు ఏపీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు ఆదేశాల ప్రకారము మరియు కర్నూలు జిల్లా డీసీసీ శ్రీ బాబు రావు ఆదేశాల ప్రకారము ఈరోజు ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ భారత పార్లమెంట్లో అగంతకులు పొగ బాంబులతో అలజడి సృష్టించారని ఇది బిజెపి ప్రభుత్వ భద్రత వైఫల్యం అని ఈ విషయం విచారణ జరపాలని డిమాండ్ చేసిన విపక్ష ఇండియా కూటమి సభ్యులైన 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజా స్వామి కమనీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మోడీ  ప్రభుత్వం వచ్చిన నాటినుండి నేటి వరకు ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చని బిజెపి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠ చెప్పాలని భారత దేశ ప్రజానీకం అమానుల్లా కోరడమైనది. బిజెపి ప్రభుత్వం వస్తే జీరో అకౌంట్ ఉన్నవాళ్ళకి 15 లక్షలు వేస్తామని అదేవిధంగా రెండు కోటి  ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేసిన బిజెపి ప్రభుత్వానికి ఇటు నిరుద్యోగులు గాని అటు రైతులు గాని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాటా చెప్పాలని భారతదేశా ప్రజలకు కోరడమైనది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వెన్నుముక లాంటి రైతులకు రైతు రుణాలు మాఫీ మరియు ఒక ఎకరానికి రైతు భరోసా కింద 15000 ఆర్థిక సహాయము మరియు నిరుపేదలకు నెలకు 6000 ఆర్థిక సహాయం చేస్తారని అమానుల్లా చెప్పడం జరిగింది. అదే కాకుండా రాహుల్ గాంధీ ప్రధాని అయితే అందరికీ సమానంగా చూసుకొని పోయే వ్యక్తి ఎవరంటే ఒక కేవలం రాహుల్ గాంధీకి సాధ్యమని అమానుల్లా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్కి మొదటి సంతకం ప్రత్యేక హోదా పై సంతకం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హరిజన పరసప్ప కురువ ఈరన్న సిద్ధమల్ల సీనియర్ నాయకులు పీరా సాబ్ డ్రైవర్ అమన్ బోయ సుధాకర్ బోయాకాడ సిద్ధ బోయా సిద్ధమల్ల ముస్తఫా అస్సలాం యువ నాయకులు నబి సబ్ రాజా ధర్మయ్య అనేకమంది కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. బిజెపి ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఎంపీలను వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

About Author