PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధైర్య పడవద్ధు అండగా ఉంటా

1 min read

– కొప్పోలి సుధాకర్ కి బరోసా ఇచ్చిన సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కడప : గుండె జబ్బుతో బాద పడు తూ ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం శ్రీనివాసా ఆసుపత్రి నందు చేరిన కమలాపురం నియోజక వర్గం వల్లూరు మండలం కొప్పొలి గ్రామ దళితవాడకు చెందిన పెద్దగాళ్ళ సుధాకర్ (వయస్సు 46 ) ను శనివారం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆసుపత్రి కి వెళ్ళి పరామర్శించారు. చిన్న వయసులో సుధాకర్ కు గుండె సంబధిత సమస్య రావడం చాలా బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చిన్న వయసులో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని సాయినాథ్ శర్మ, సుధాకర్ కుమారుడు సురేంద్ర కు వారి కుటుంబ సభ్యులకు బరోసా ఇచ్చారు. అనారోగ్య పరంగా ఇబ్బందులు ఎదురైతే ఎంతవరకైనా ఆర్థిక సహాయం చేసి సుధాకర్ ను ఆరోగ్య వంతుడుగా వచ్చే వరకు బాధ్యత తీసుకుంటానని సాయినాథ్ శర్మ వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం తో వారిలో ఆనందం వ్యక్తమైంది ఈ మేరకుపది వేల రూపాయలు ఆర్థిక సహాయం సాయినాథ్ శర్మ అందించారు ఆయన వెంట కోప్పోలి గ్రామానికీ చెందిన చంద్ర,గణేష్ వల్లూరు చిట్టిబాబు, శివారెడ్డి బాలకృష్ణ రెడ్డి జనార్ధన్ రెడ్డి నాగరాజ ఆచారి ఆది శ్రీనివాసులు నామాల సోదరులు రాజా రమేష్ శివరామిరెడ్డి సంజీవ్ తదితరులు సుధాకర్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

About Author