గజ వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో కన్నుల పండగగా జరుగుతున్నాయి. 7వ రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారు కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచరణాలు.. అశేష భక్త జనుల మధ్య ఆది దంపతులను గజవాహనంలో ఊరేగించారు.
కాలరాత్రి అలంకారంలో.. శుభంకరి అమ్మవారు
నవదుర్గ స్వరూపాలలో ఏడవ రూపం ఈ కాళరాత్రి. దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరియబోసుకొని పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపములో ఉంటుంది. అలంకారంలో అమ్మవార్లు చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయహస్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహకంటకాన్ని ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూడటానికి రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
కార్యక్రమంలో ఆలయ వేద పండితులు ఆలయ అర్చకులు మరియు ఆలయ అధికారులు ఈఓ. లవన్న పాల్గొన్నారు