PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం

1 min read

టాలీవుడ్ హీరో, డైలాంగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది కొత్త సినిమా ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని శిఖ‌ర క్రియేష‌న్స్ ప‌తాకం పై గుడివాడ యుగంధ‌ర్ నిర్మిస్తున్నారు. భాస్కర్ బంటుప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొందుతోంది. సాకేత్ సంగీతం అందిస్తున్నారు. త్వర‌లో హీరోయిన్, న‌టీన‌టుల వివ‌రాలు ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపారు. ఇటీవ‌లే ఆది సాయికుమార్ న‌టించిన ‘శ‌శి’ చిత్రం విడుద‌లైంది. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఒకే ఒక లోకం’ అనే సాంగ్ సన్సేషన్ సృష్టించింది. ఈ పాట కొన్ని ల‌క్షల వ్యూవ్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడ విజ‌య‌వంతమ‌వుతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో ఆది స‌రికొత్త లుక్స్ లో అల‌రించ‌నున్నార‌ని ద‌ర్శకులు తెలిపారు.

About Author