PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘ఆదిత్య 369’

1 min read

సినిమా డెస్క్​: కాలానికి ఎదురెళ్లడం లేదా వెనక్కి వెళ్లడం వంటి కథలు అప్పుడప్పుడు వెండితెరపై వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. హాలీవుడ్​లో ఇటువంటి చిత్రాలు మరీ ఎక్కువ. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ల నటించిన ‘ప్లే బ్యాక్‌’ మూవీ అలాంటిదే. రీసెంట్‌గా ఆహాలో రిలీజైన అమలాపాల్‌ నటించిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ కూడా టైమ్‌ లూప్‌ బ్యాక్‌డ్రాప్‌తో తయారైన కథే. ఇంతకీ విషయమేమిటంటే ఈ టైమ్‌ సెన్స్‌తో వచ్చే సినిమాలకి గిరాకీ బాగానే ఉంటోంది. ప్రేక్షకులు కూడా ఏ తరంలో ఇటువంటివి వచ్చినా అలాగే ఆదరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో 1991లో వచ్చిన బాలకృష్ణ మూవీ ‘ఆదిత్య 369’ ని మాత్రం ఎవర్‌‌ గ్రీన్‌ మూవీగా చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్‌నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ఈ మూవీకి ఉంది. గ్రాఫిక్స్‌ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే తొలి ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ మూవీకి నేటితో (జూలై 18)తో 30 ఏళ్లు. ఈ టైమ్‌ ట్రావెల్‌ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌.

ట్రెండ్​ సెట్​.. :
అప్పట్లో ట్రెండ్‌ సెట్‌ చేసిన చిత్రమిది.30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియా అభిమానులతో మాట్లాడుతూ ‘ఆదిత్య 369’ విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం, అజరామరం. అప్పుడు మేం చేసిన ప్రయత్నాన్ని ఆదరించి, ఇప్పటికీ చూస్తున్నారు. ఎప్పటికీ చూస్తుంటారు. ఆ సినిమా ఒక శ్రవణానందం, నయనానందం. కొన్నిటి గురించి ఎక్కువ మాట్లాడితే సూర్యుడిని వేలెత్తి చూపించినట్టు అవుతుంది. అటువంటిదే ‘ఆదిత్య 369’. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయే సినిమాలు, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఆదిత్య 369’. ఒక పాతాళ భైరవి మల్లీశ్వరి, దేవదాసు, ‘సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, బొబ్బిలి పులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి, సింహా, లెజెండ్, మంగమ్మగారి మనవడు – ఈ జాబితాలో నిలిచిపోయే సినిమా ‘ఆదిత్య 369’. ఇవాళ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయ్యిందంటే చాలా సంతోషంగా ఉంది.

About Author