సీఎం ఛీఫ్ అడ్వైజర్‌గా…అదిత్యనాథ్! రిటైర్డ్ తర్వాత బాధ్యతలు
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన సేవలు ప్రభుత్వానికి అవసరమని భావించిన సీఎం వై.ఎస్.జగన్ ఛీఫ్అడ్వైజర్గా నియమించారు. కాగా సీఎస్ అదిత్యనాథ్ పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ఆయన స్థానంలో ఇప్పటికే కొత్త సీఎస్‌గా సమీర్‌శర్మను నియమించిన విషయం తెలిసిందే. అయితే అదిత్యనాథ్ దాస్ ఢిల్లీలోని ఏపీభవన్ నుంచి సీఎం ఛీఫ్అడ్వైజర్గా తన విధులు నిర్వర్తంచనున్నట్లు తెలిసింది.