మోడల్ పాఠశాలలో ఆరవ తరగతికి అడ్మిషన్లు
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మోడల్ పాఠశాలలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో చేరుటకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సలీం భాష అన్నారు.ఈనెల 9వ తేదీ నుంచి 25వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 11వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు 75 రూ.లు,ఓసీ బీసీలకు 150 రూ.లు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ అన్నారు.