ఆదోని పద్మశాలి కార్తీక మాస వన భోజన మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదోని పద్మశాలి సేవా సంఘం అద్యక్షులు బుదర్పు లక్ష్మన్న మరియు మహిళా సేవా సంఘం అద్యక్షురాలు శ్రీమతి జెరుబండి శ్యామల బాబు ల అధ్వర్యంలో స్థానిక పద్మశాలి నగర్ నందు అంగరంగ వైభవంగా జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దంతవైద్యుడు శ్రీ జక్కా రవి కిరణ్, సోమ బ్రహ్మానందం ,జెరుబండి బాబు, ఎలక్ట్రికల్ A.E పులిపాటి చంద్ర శేఖర్ , మేడం చిన్న ఆదిమూర్తిపాల్గొన్నారు.కార్యక్రమంలో అతిధులు ప్రసంగిస్తు వన భోజన ప్రాముక్యతను వివరించి అలాగే పద్మశాలియులు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అలాగే రాజకీయంగా కూడ మన ఊనికిని చాటుకోవాలన్నారు. స్తానిక మార్కండేయ స్వామి దేవాలయం అభివృద్దికీ విరాళాలు యిచ్చిన కుల భాంధవులందరినీ సన్మానించడం జరిగింది.వన భోజన కార్యక్రమం లో భాగం గా బాల బాలికలకు మరియు మహిలలకు ఆటల పోటిలు మరియు సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. వన భోజనంలో పద్మశాలియులు అందరూ కుటుంబ సమేతంగా పాల్గోని తమయొక్క ఆనందాన్ని వ్యక్త పర్చారు.ఈ కార్యక్రమo లో ఆదోని పద్మశాలి సేవా సంఘం మరియు మహిళా సేవా సంఘం కార్యవర్గ సభ్యులు గోరంట్ల నారాయణ మూర్తి, మాకం నాగరాజు, గడ్డం హంపయ్య, పొబ్బత్తి రంగస్వామి, చిలక శేఖర్, చిలక నిర్మల, గోరంట్ల అనసూయమ్మ, ఆడమి శకుంతలమ్మ మరియు కుల భాంధవులు అందరు పాల్గొన్నారు.