బంగారు నంది అవార్డు గ్రహీతకు ఆదోని సబ్ కలెక్టర్ అభినందన
1 min read
ఆదోని, న్యూస్ నేడు: ఆదోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్((అవోప) కు ఉత్తమ సేవ సంస్తగా, వంకదారు శ్రీనాథ్ గుప్తకు ఉత్తమ సంఘ సేవ కర్తగా, ఉత్తమ సంఘ సేవ కేటగిరిలో బంగారు నంది అవార్డును తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు కు చెందిన మెగా హెల్ప్ ఫౌండేషన్ ద్వారా పొందిన సందర్భంగా గురువారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వంకదారు శ్రీనాథ్ గుప్తకు అభినందించారు. అవోపా బృందానికి మరియు మెడికల్ క్యాంప్ల అన్నింటికీ సౌజన్య కర్తగా వ్యవహరించిన శ్రీ కాకుబాళ్ నగేష్ కి చెందుతున్నది అని సబ్ కలెక్టర్ కి వివరించారు. భవిషత్తలో మరిన్ని మెరుగైన, ఉపయోగకరమైన సేవలు ఆవోప , వామ్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అందించాలని సబ్ కలెక్టర్ సూచించారు.