సిసి రోడ్డును పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
1 min read
పల్లెవెలుగు ,మంత్రాలయం : మండల పరిధిలోని చిలకలడోణ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. మంగళవారం మంత్రాలయం తుంగభద్ర నదిలో అక్రమ ఇసుక రవాణా తహసీల్దార్ రవి, సిఐ రామాంజులు తో కలిసి పరిశీలించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండుపోగు నేపాల్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మార్గమధ్యంలో చిలకలడోన లో సిసి రోడ్డు ను పరిశీలించి రోడ్ ఫిట్నెస్ అధికారులు త్వరలోనే పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ సీసీ రోడ్డు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సిసి రోడ్డుకు సంబంధించి ఫిట్నెస్ అధికారులు నివేదిక బట్టే చర్యలు ఉంటాయని ఆదోని సబ్ కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ముసలి వాళ్లు రాత్రిపూట వేళ్లలో నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని కొన్ని సందర్భాల్లో కిందికి పడటం కూడా జరిగిందని అలాగే యాక్సిడెంట్లకు గురవుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిసి రోడ్డు పై ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగినదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సల్మాన్, నాగన్న, ఏసు మిత్ర,తదితరులు పాల్గొన్నారు.