NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులకు గృహ శిశు బాలిక దత్తత..

1 min read

దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : కర్ణాటక రాష్ట్రానికి చెంది పిల్లలు లేని దంపతులకు ఏలూరు లోని శిశు గృహలో పెరుగుతున్న  బాలికను మహిళాభివృద్ది ,శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సమక్షంలో దత్తతకు ఇచ్చారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  16 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కర్ణాటక కు చెందిన హరీష్ కె. పుష్పాల దంపంతులకు దత్తత అందజేశారు. ఈ సందర్భంగా దత్తత ధ్రువపత్రాలను వారికి  కలెక్టర్ అందజేశారు. 16 సంవత్సరాల  వయస్సు గల బేబీ సిరి అనే  బాలికను  కర్ణాటక కు చెందిన దత్తత అర్జీదారీలు హరీష్. కె పుష్ప  దంపతులు  2020సం. లో బాలిక కొరకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది.హరీష్  పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. పుష్ప   గృహిణిగా వున్నారు. పెద్ద పిల్లలను దత్తత పొందువారు తగు జాగ్రత్తలు పాటించి పిల్లలను జాగ్రత్తగా పెంచాలని కలెక్టర్ సూచించారు. వారిపై ప్రత్యేక పర్యవేక్షణ  అవసరమన్నారు.చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ లో ఆశ్రయము పొందుతున్న అనాధ పిల్లలు  దత్తత వెళ్ళుటకు ఇష్టపడిన వారిని కారా నియమ నిబంధనల ప్రకారము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆర్డర్స్ ద్వారా  దత్తత ఇచ్చుటకు తగు చెర్యలు తీసుకోవాన్నారు. కార్యక్రమం లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారాతధికారి, కె. పద్మావతి, జిల్లా బాలల సంరక్షణా  అధికారి  సిహెచ్. సూర్య చక్ర వేణి, బాలల రక్షణాధికారి ఆర్. రాజేష్, శిశు గృహ మేనేజర్  భార్గవి   పాల్గున్నారు.

About Author