పండుగల” అడుదాం ఆంధ్రా” క్రీడాలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మండల స్థాయి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను బుధవారం అధికారులు పండుగల నిర్వహించారు.నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి , జడ్పీటిసి కలిమున్నీసా ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి ,జడ్పీటీసీ కలిమున్నీసా మాట్లాడుతూ దేశంలోనే మెట్టమెదటిసారి ఆటల పండుగను తీసుకొచ్చిన ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. యువత క్రీడలలో రాణించే విధంగా ప్రభుత్వం ఇలాంటి పోటిల ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆటల వలన శరీర వ్యాయమం కలిగి అరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్రా ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు క్రీడలు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, ఈఓఆర్డీ సంజన్న, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర బాబు, నూరుల్లా , చంద్రశేఖర్, వ్యాయమ ఉపాధ్యాయులు వీరన్న , డోరతీ , పగడం రాగన్న , పాఠశాల ఉపాధ్యాయులు , క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.