ఏలూరు జిల్లాలో 2024-25 రబీ పంట ధాన్యం సేకరణకు ముందస్తు చర్యలు
1 min read
సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి
ఈ కెవైసీ త్వరగాతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రాబోవు 2024-25 రబీ పంట కాలములో ధాన్యం కొనుగోలుకు సంభందించి ధాన్యం పండించు రైతుల యొక్క ఖచ్చిత వివరములు పూర్తి పారదర్శకముగా పంట నమోదు చేసి, ఈ కెవైసి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.గురువారం స్థానిక కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక అమలు లో భాగముగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్, తూనీకలు మరియు కొలతల సహాయ కంట్రోలర్ జిల్లా కో-పరేటివ్ అధికారి, దాన్యం కొనుగోలు సహాయ ఏజన్సీల జిల్లా అధికారులు మరియు రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షులు,అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వ్యవసాయ శాఖ వారిచే నమోదు చేయబడిన ఆ పంట ఆధారముగా మాత్రమేజరుగునని కావున, జిల్లాలో వరి సాగు చేయుచున్న రైతు పేరును కౌలు రైతుల యెక్క పేర్లను కూడా ఖచ్చితముగానమోదు చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుటకు కావలసిన గోనే సంచులను రైస్ మిల్లర్లుముందస్తుగానే పరిశీలించి మంచి స్థితిలో గల గోనే సంచులను ముందుగానే జిల్లా కోపరేటివ్ అధికారి వారు నిర్దేశించిన గోడౌన్లలో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలన్నారు.ధాన్యం యొక్క నాణ్యత ప్రమాణాలపై,ప్రభుత్వం రైతులకు కల్పించు సౌకర్యములపై అనగా చెల్లించు ఖర్చు వంటి విషయములను రైతులకు గ్రామసభల ద్వారా పూర్తి అవగాహన కల్పించాలని, కరపత్రములు,బ్యానర్లు ద్వారా కూడా అవగాహన కల్పించాలన్నారు.సమావేశంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ వి ఎస్ ఆర్ శ్రీలక్ష్మి, డీఎస్ఓ ఆర్ ఎస్ ఎస్ రాజు, జిల్లా వాణిజ్య మార్కెటింగ్ శాఖధికారి వి.మహేంద్ర, వ్యవసాయ శాఖ అధికారివై.సుబ్బారావు,డిసివో శ్రీనివాస్, అర్టీ వో మదాని,వివిధ శాఖల అధికారులు,రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
