దళితుల అభ్యున్నతి.. టీడీపీతోనే సాధ్యం…: పుల్లగూర శ్రీనివాసులు
1 min readపల్లెవెలుగు వెబ్,చెన్నూరు: కమలాపురం నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పుల్లగూర శ్రీనివాసులు చేపట్టిన దళిత ప్రతిఘటన పాదయాత్లో దళితుల అభ్యున్నతికి టీడీపీతోనే సాధ్యం అని చెన్నూరు మండలం ముండ్లపల్లి గ్రామం దళితవాడ నుంచి కడప పార్లమెంట్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గన్నేపాటి మల్లేష్ మరియు చెన్నూరు మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందిరెడ్డి రెడ్డి శివారెడ్డి, కడప పార్లమెంట్ బిసి కార్యదర్శి ఇరగనబోయిన హరికృష్ణ యాదవ్, రైతు నాయకులు మల్లికార్జున్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, సాదు కార్తీక్,యమల మణికంఠ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించి ఘనంగా స్వాగతం పలికి సంఘీభావ ప్రకటించి ముండ్ల పల్లి దళితవాడలో ప్రతి ఇంటికి వెళ్లి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అధికార వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి దళితవాడల్లో తీసుకెళ్లి దళితుల్లో చైతన్యపరిచేందుకు మండలంలోని ప్రతి ఒక్క నాయకుడు దళిత వాడలు తిరుగుతూ చైతన్య పరుస్తున్నారు, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దళితులకు అనేక సంక్షేమ పథకాలు పెళ్లి కానుక, ఎస్సీ మహిళలకు సబ్సిడీ రుణాలు, దళితవాడలో సిమెంట్ రోడ్లు వీధిలైట్లు డ్రైనేజీ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని సాక్షాత్తూ దళితవాడల్లో మహిళలు చెబుతున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని స్వయానా దళితుల తోపాటు మండల నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు, కాబట్టి దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క దళిత కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మండల నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల నాయకులు ముండ్లపల్లి రాజశేఖర్‌రెడ్డి, కడప పార్లమెంటు అధికార ప్రతినిధి మరియు అక్బర్, మైనార్టీ నాయకులు షబ్బీర్ హుస్సేన్, కల్లూరు ఓబుల్ రెడ్డి,ఐటీడీపి సభ్యులు ముక్తియార్ రాము , నక్క గురప్ప, మాజీ ఎంపిటిసి గౌస్ పీర్, చెన్నూరు మండల ఎస్సి నాయకులు బొమ్మా గాళ్ళ సురేష్, పోస్టల్ సుబ్బరాయుడు, ఎద్దుల వెంకటేష్, ప్రతి రోజు పాదయాత్రలో పాల్గొన్న నియోజకవర్గ నాయకులు కొండాల చెన్నయ్య, రాంప్రసాద్, రామాంజనేయులు, గడ్డం వెంకటసుబ్బయ్య రాంబాబు 1st వార్డు మెంబెర్, రాకేష్,విజయకుమార్ , గుర్రయ్య తెలుగుదేశం పార్టీ చండూరు మండల నాయకులు కార్యకర్తలు, ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.