ఏసు బోధనలు అనుసరణీయం…. జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : క్రీస్తు బోధనలు అనుసరణీయమని, ఆయన చూపిన శాంతి మార్గం ఆచరణీయమని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా శాంతి కమిటీ సభ్యులు బిషప్ అమ్రోజ్, పాస్టర్ సుధాకర్ లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన గారిని మర్యాదపూర్వకంగా కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.తొలుత క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని Ecclesia Episcopal Synod Foundation తరుపున కర్నూల్ జిల్లా శాంతి కమిటీ సభ్యులు బిషప్ అమ్రోజ్, పాస్టర్ సుధాకర్ లు కలెక్టర్ గారిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు కలెక్టర్ గారిని ఆశీర్వదించి మిఠాయిలు తినిపించారు.తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఏ మతం అయినా విశ్వ శాంతినే కోరుతుందన్నారు. శాంతియుత సహజీవనమే క్రిస్మస్ సందేశం కాగా, సకల జనులూ సంయమనంతో కలిసిమెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు సర్వ మానవాళికీ స్ఫూర్తిదాయకమైనవని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ మాత్రమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్నూల్ జిల్లా శాంతి కమిటీ సభ్యులు బిషప్ అమ్రోజ్, పాస్టర్ తాతపుడి సుధాకర్, ఆండ్రూ, యేసు బాబు, ప్రార్థన మందిరం భాస్కర్ , బ్రదర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.