వైసీపీ ఎమ్మెల్సీని అడ్డుకున్న బాధిత కుటుంబం !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వాహనాన్ని లేపాక్షిలో తోపుడు బండి వ్యాపారి మల్లయ్య కుటుంబీకులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇదే వాహనం ఎమ్మెల్సీ ప్రయాణించే సమయంలో గతేడాది డిసెంబరు 31న లేపాక్షి బస్టాండు వద్ద కొండూరుకు చెందిన మల్లయ్యను ఢీకొంది. ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తాజాగా ఆయన కుటుంబం తమకు న్యాయం చేయలేదంటూ ఆరోపించింది. ప్రమాదంపై కేసు నమోదు చేశామని, బీమా సొమ్ము రావడం కాస్త ఆలస్యం అవుతుందని పోలీసులు తెలిపారు.