NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాలబ‌న్ల చెరలో ఆఫ్గన్.. ద‌య‌నీయంగా మ‌హిళ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తాలిబ‌న్ల చెర‌లో ఆఫ్గనిస్థాన్ దేశం నియంత్రణ కోల్పోతుంద‌ని ఐక్యరాజ్య స‌మితి ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఆప్ఘనిస్థాన్ లో నెల‌కొన్న ప‌రిస్థితుల ప‌ట్ల సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ ఆవేద‌న వ్యక్తం చేశారు. తాలిబ‌న్లు త‌క్షణ‌మే దాడులు నిలిపివేయాల‌ని కోరారు. బ‌ల‌ప్రయోగం సుదీర్ఘమైన అంత‌ర్యుద్దానికి దారి తీస్తుంద‌ని తెలిపారు. దేశాన్ని ఒంటరిని చేస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది అక్కడి ప్రజ‌ల‌కు తీర‌ని విషాద‌మ‌ని తెలిపారు. మ‌హిళ‌లు ద‌య‌నీయ‌మైన స్థితిలో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. అధికారం కోసం యుద్దమార్గాన్ని ఎంచుకున్న వారికి అంత‌ర్జాతీయ స‌మాజం స్పష్టమైన సందేశం ఇవ్వాల‌ని సూచించారు.

About Author