14 ఏళ్ల తర్వాత.. అగ్గిపెట్టె ధరలు పెరిగాయి !
1 min read
పల్లెవెలుగు వెబ్ : అగ్గిపెట్టె ధరలు పెరిగాయి. 14 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అగ్గిపెట్టె ధరలు పెరగడం విశేషం. 2007లో 50 పైసలు ఉన్న అగ్గిపెట్టె ధర.. రూ. 1 కి పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు రూ. 1 నుంచి రూ.2కి అగ్గిపెట్టె ధరను పెంచనున్నారు. డిసెంబర్ 1 నుంచి అగ్గిపెట్టె ధరలు పెరగనున్నాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడిపదార్థాల ధరలు పెరిగిన కారణంగా.. అగ్గిపెట్టె ధరలు పెంచుతున్నారు. రెడ్ ఫాస్పస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం ధరలు పెరిగాయి. ఇంధనం ధరలు పెరగడంతో రవాణ చార్జీలు కూడ తయారీదారులకు భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్గిపెట్టె ధరలు పెంచనున్నారు.