పెళ్లైన 4 నెలలకే.. నయనతారకు కవల పిల్లలు !
1 min read
పల్లెవెలుగువెబ్: ప్రముఖ హీరోయిన్ నయనతార ఇద్దరు మగబిడ్డలకు తల్లయింది. సరోగసీ ద్వారా నయనతారకు కవలలు కలిగారు. ఈ విషయాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కాగా, తమ కుమారుల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని పేర్కొన్నారు. నయనతార, తాను అమ్మానాన్నలమయ్యాయని విఘ్నేశ్ శివన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో ఉజ్వలంగా, మనోహరంగా ఉన్నట్టు అనిపిస్తోందని తెలిపారు. దేవుడు డబుల్ గ్రేట్ అని కొనియాడారు. తమ ప్రార్థనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగిందని వెల్లడించారు.