నీటిని తాగాక.. బాటిల్ ఎందుకు ధ్వంసం చేయాలంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : వాటర్ బాటిల్ కొనుగోలు చేశాక.. నీటిని తాగి బాటిల్ ధ్వంసం చేయాలని దాని పై రాసి ఉంటుంది. కంపెనీలు ఇలా రాయడం వెనుక రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఇన్ఫెక్షన్ ముప్పు. ఒక్కో వాటర్ బాటిల్ లో 9 లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో వాటర్ బాటిల్ అలాగు ఉంచితే బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. రెండో కారణం వాడిన బాటిల్ మళ్లీ వాడటం. ఈ కారణంగా బాటిల్ లో ఉన్న బ్యాక్టీరియా వ్యాప్తి చెందటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో కంపెనీలు బాటిల్ ను వాడిన తర్వాత ధ్వంసం చేయాలని సూచిస్తాయి.