NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైత‌న్యతో విడిపోయాక‌.. చ‌చ్చిపోతా అనుకున్నా : స‌మంత

1 min read

పల్లెవెలుగు వెబ్​: అక్కినేని నాగ‌చైతన్యతో విడాకుల త‌ర్వాత స‌మంత తొలిసారిగా స్పందించారు. ఓ జాతీయ టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటికీ బాధ‌ప‌డిన ఆ రోజులు గుర్తున్నాయ‌ని, చైతూతో విడిపోయినప్పుడు కుంగిపోయి చ‌నిపోతాన‌నుకున్నాన‌ని అన్నారు. కానీ తాను అనుకున్నదానికంటే శ‌క్తిమంతం అయ్యాన‌ని చెప్పారు. మ‌న జీవితంలో కొన్ని రోజులు చెడుగా ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాల‌ని, ఎప్పుడైతే వాటిని అంగీక‌రించి ముందుకెళ్తామో స‌గం ప‌ని అయిన‌ట్టేన‌ని స‌మంత చెప్పారు. త‌న‌ను తాను చాలా బ‌ల‌హీన‌మైన వ్యక్తి అని అనుకుంటాన‌ని, కానీ త‌న వ్యక్తిగ‌త జీవితంలోని స‌మస్యలు ఇంత బలంగా ఎదుర్కొన‌డం చూసి త‌న‌కే ఆశ్చర్యం వేస్తుంద‌ని ఆమె అన్నారు.

About Author