PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితురాలిని పరామర్శించి.. ఆర్ధిక సహాయం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కళ్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మ పై జరిగిన దారిన ఖండిస్తూ గ్లోబల్ ఇన్ఫార్మ్ మ్యాక్ (మేధావుల సంఘం) ఆధ్వర్యంలో విశ్రాంత అదనపు డిజిపి డాక్టర్ బాబూరావు అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ కళ్ళుకుంట గ్రామం సందర్శించింది,ఈ కమిటీలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ సురేష్ పులుగుజ్జు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ భజన్ సతీష్, ఏపి మాజీ అధ్యక్షులు సురేంద్రనాథ్ ఇతర కమిటీ నాయకులు పాల్గొన్నారు,  గ్రామంలోని వివిధ వర్గాలతో మాట్లాడి సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, బాధితు రాలు కుమారుడు రాజు, బంధువు బతుకమ్మతో పాటు గోవిందమ్మను కర్నూలు లోని జనరల్ ఆసుపత్రి లో కలిసి చర్చించారు,  బాధితురాలిని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు, గోవిందమ్మ పెద్ద కుమారుడు బిసి మహిళను పోలీస్ సమక్షంలో పెళ్లిచేసుకోవడం వల్ల వారు పెట్టిన వేధింపులకు తట్టుకోలేక బెంగుళూరు లో తలదాచుకుంటున్నారని, ఆ రోజునుండి ఆమెను గ్రామ బహిష్కరణ చేయగా మండల కేంద్రమైన ఎమ్మిగనూరు లో కూలీ చేసుకుని బతుకుతున్నట్టు తెలిపారు, ఆమె ఒంటరిగా జీవిస్తున్నట్టు, ప్రాణ భయంతో బతికినట్టు బృందానికి తెలిపారు, అయితే కొన్ని కుటుంబ అవసరాల నిమిత్తం స్థానికి పోలీసుల అనుమతితో ఊర్లోకి వచ్చానని, ఇంట్లో ఉన్న సమయంలో అనేకమంది అగ్రకులాల పురుషులు, స్త్రీలు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారని, ఆమె బట్టలుడదీసి, బహిరంగంగా దారివెంట ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ  ఊరి నడిమధ్యకు తీసుకుపోయారని అక్కడ స్తంభానికి కట్టేసి చితకబాదారని తెలిపారు అక్కడి ఉన్న వారు పోలీసులకు తెలియజేయగా సకాలంలో స్పందించిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆమెను కాపాడినట్టు తెలిపారు, ఆర్టికల్ 17 భారత రాజ్యాంగం కుల , మత, ప్రాంత, జాతి వివక్షను రద్దుచేసిందని, దేశంలో ని ఎక్కడైనా జీవించే హక్కు ను, వ్యక్తి గత స్వేచ్ఛను ఆర్టికల్ 21 పౌరులకు రాజ్యాంగం ప్రసాదించింది అయితే రాజ్యాంగ ఇచ్చిన హక్కులు, అమలు కు నోచుకోవడం లేదని బృందం అభిప్రాయ పడింది, మతోన్మాదం వల్ల సమాజంలోవివక్ష పెరిగిపోతుందని విలేకరుల శమావేశంలో తెలియ జేశారు, గోవిందమ్మకు జరిగిన అన్యాయం మీద స్థానిక జిల్లా కలెక్టరు పి ఏ రంజిత్ బాషాకు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందుమాధవ్ ను కలసి చర్చించారు, నిందితులు తప్పించుకోకుండా చూడాలని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కన్నబిడ్డకు దూరంగా, స్వగ్రామానికి బయట బట్టలేక పోతున్న ఆమెకు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి రాజ్యాంగ హక్కులను, ప్రాథమిక హక్కులను కాపాడటమంటే గోవిందమ్మకు తమ స్వగ్రామానికి చేర్చి, భద్రత కల్పించాలని, సమాజంలో నెలకొన్ని కుల వివక్ష తను రూపు మాపడానికి సమాజంలో చైతన్య అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని, తద్వారా ఇటువంటి భయంకరమైన దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చని బృందం అధికారులకు సలహా ఇచ్చింది, పెదకడబురులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బృందం పాల్గొని ప్రసంగించారు, అందరూ ధైర్యంగా వుండాలని, సమాజం అండగా ఉంటుందని, ప్రభుత్వం న్యాయం చెయ్యక పోతే కోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి బాధితురాలికి న్యాయం చేసేవరకు న్యాయ పోరాటం చేస్తామని విశ్రాంత  పోలీస్ అధికారి డాక్టర్ బాబురావు  వేలేకరుల సమావేశంలో వెల్లడించారు.

About Author