NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా సాధికరతపై దృష్టి పెట్టి సాధించిన ఏకైక నేత మన జగనన్న

1 min read

ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి , శ్రీమతి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   ఎమ్మిగనూరు మండల 4వ విడత వై యస్ ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారు, 4275 మంది అక్కచెల్లెమ్మలకు 8.02 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి”  మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేయూతనిస్తే, వారి కుటుంబం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కచెల్లెమ్మల కోసం ‘వైయస్‌ఆర్‌ చేయూతపథకాన్ని ప్రవేశపెట్టి,ఏటా ₹18,750 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు మన జగనన్నగారు. రాష్ట్రంలోని మహిళలను తన సొంత అక్కచెల్లమలుగా భావించి,అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు వారికి ఆర్ధికంగా సాయం చేసారు మన జగనన్న.. డ్వాక్రా రుణ మాఫీ చేసి, జగనన్న చేయూత, జగనన్న చేదోడు.. ఇలాంటి పధకాలతో మహిళలకు డబ్బుని అందించి ఆ డబ్బుతో వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు సాయం చేస్తున్న జగనన్న తన అక్కచెల్లెమల కలలను నెరవేర్చుతున్నారు.అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతూ..మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్  పాలన సాగుతోంది. అక్కచెల్లెమ్మలు వివిధ జీవనోపాధులు ఏర్పాటుచేసుకుని తమ కాళ్లపై తాము నిలబడ్డారు అని అన్నారు.ఈ కార్యక్రమం నాయకులు, మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి , బుట్టా శివనీలకంఠ. ఎంపీపీ కేశన్న ,మండల కన్వీనర్, జె సి ఎస్ కన్వీనర్, పొదుపు మహిళ సభ్యులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author