PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌య‌సు 13 ఏళ్లు.. ఏడాదికి 400 కోట్ల సంపాద‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మిస్ట‌ర్ బీస్ట్.. యూట్యూబ్ లో ఈ పేరు తెలియ‌ని వారు చాలా తక్కువే ఉంటారు. అస‌లు పేరు జిమ్మీ డొనాల్డ్ స‌న్. యూట్యూబ్ వీడియోల‌తో పేరు ద‌క్కించుకున్న వ్య‌క్తి జిమ్మీ డొనాల్డ్ స‌న్. ఫోర్బ్స్‌ జాబితాలో 2021 ఏడాదికి గానూ 23 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్‌సన్‌ ‘యూట్యూబ్‌ హయ్యెస్ట్‌ ఎర్నింగ్‌ కంటెంట్‌ క్రియేటర్‌’గా నిలిచాడు. తన వీడియోలకు పది బిలియన్‌ వ్యూస్‌ పైగా రాబట్టుకుని.. ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. ముఖ్యంగా ‘స్క్విడ్‌ గేమ్‌’ స్ఫూర్తితో భారీ స్టేడియంలో అతను నిర్వహించిన హైడ్‌ అండ్‌ సీక్‌ ఆటకు భారీ స్పందన లభించింది. కిందటి ఏడాది మిస్టర్‌బీస్ట్‌ ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 45 మిలియన్‌ డాలర్ల సంపాదనతో జేక్‌ పాల్‌ రెండో స్థానంలో నిలిచాడు.

                                   

About Author