PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఏజెంట్’ .. పొట్టేలు టాటూ..

1 min read

సినిమా డెస్క్​ : అక్కినేని అఖిల్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్, ‘ఏజెంట్’ వంటి యాక్షన్‌ మూవీలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖిల్‌ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రం రూపొందుతోంది. ఇది అఖిల్‌ ఐదో సినిమా. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీలోసరికొత్త మేకోవర్‌‌తో అఖిల్ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. పోస్టర్ లో వెనుక నుండి కండలు తిరిగిన బాడీతో జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ, మునుపెన్నడూ కనిపించని ఫిజిక్ తో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు అఖిల్‌. వీపుపై వేసిన పొట్టేలు టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఆకట్టుకుంటోంది.. ‘ఇది ఆరంభం మాత్రమే.. మీకు ముందు ముందు ఉంది పండుగ.. ఏజెంట్ లోడింగ్ వైల్డ్‌ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా’ అంటూ పోస్టర్‌‌తో పాటు ట్వీట్ చేశాడు సురేందర్ రెడ్డి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్పై ఏజెంట్‌గా అఖిల్ కనిపించబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్. వక్కంతం వంశీ కథను అందించాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్నట్టు సమాచారం.

About Author