PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు.. నాయకులు

1 min read

హొళగుంద తహసీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, నాయకులు

పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన దృశ్యం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన సీబీఎస్ఈలో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగుతో పాటు కన్నడ, ఉర్దూలను కొసాగించాల్సిందేనని గురువారం ఆ మీడియం విద్యార్థుల తల్లిదండ్రులు, కన్నడ, ఉర్దు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆ దిశగ చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చెయాలని ఆ తరువాత తహసీల్దారు హుసేన్ సాహేబ్కు వినతి పత్రం అందజేసారు. అంతకు ముందు హైన్కూల్ వద్ద చేపట్టిన వి ఆందనను తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎంఈఓలు జగన్నాదం, సత్యనారాయణతో వారు వాగ్వీదానికి దిగారు. సంఘాల నాయకులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు- శివన్నగౌడ్, ఈశా, సిద్దయ్య, రుద్రగౌడ్, గవి సిద్దప్ప, ఆదాం, మల్లి, సుబాన్, హమీద్, ఇర్ఫాన్, జాంటీ వీరేశ్, సిద్దప్ప తదితరులు మాట్లాడుతూ సీబీఎస్ఈని ప్రవేశ పెట్టడం మంచిదే అయినా సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు తప్పా కన్నడ, ఉర్దూరు కొనసాగించకపోవడం వల్ల ఈ మీడియం విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు గురించి వివరించారు. హొళగుంద గ్రామం కర్నాటక రాష్ట్రం సరిహద్దును ఉండడం, ముస్లీం మైనార్టీలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడి విద్యార్థులు ఉన్నడ, ఉర్దూ మీడియంను అధిక సంఖ్యలో చదువుతున్నట్లు వివరించారు. సీబీఎస్ఈ పేరిట ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే విద్యార్థులు చదువుకోలేరని మద్యలో బడి మానేస్తారని చెప్పారు. అదేవిధంగ పరీక్షలు ఎలా వ్రాయగలరని దీనివల్ల వారి భవిషత్తు అందాకారంలో వస్తుందని వాపోయారు. తప్పని సరిగా సెకండ్ లాగ్వేజ్ల కింద కన్నడ, ఉర్ధుకు అవకావం కల్పించాలని లేదా కన్నడ, ఉర్దూ మీడియంలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేసారు. అంత వరకు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చాలా సేవు వారు ఆందకోనను కొనసాగిస్తూ విద్యార్థులతో కలిసి పాఠశాల ముందు బైఠాయించారు. నమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పటికే లేటర్ కూడా పంపించినట్లు ఎంఈఓ,  తెలువుతూ వారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని అంత వరకు సహనంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోయిన్, ఎం శేఖర్, అబ్దుల్ రహిమాన్, తిప్పేసి, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

About Author