`అగ్నిపథ్` పరిశ్రమలకు తోడ్పడుతుంది : టాటా సన్స్ చైర్మన్
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ పథకం ద్వారా క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత తయారవుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ పరిశ్రమకు ఈ యువత ఎంతగానో తోడ్పాడుతుందని, టాటా గ్రూప్‌కు కూడా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకానికి ఇప్పటికే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంక, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందర్ షా, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి వంటి పారిశ్రామిక వేత్తలు సమర్ధించారు.