NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`ఊ అంటావా మావ‌` పాట‌కు స‌మంత ఎలా ఒప్పుకుందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుష్ప సినిమాలో స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. అస‌లు ఇలాంటి పాట‌కు స‌మంత ఎలా ఒప్పుకుంద‌న్న అనుమానం అభిమానుల్లో రేకెత్తింది. దీనికి డైరెక్ట‌ర్ సుకుమార్ స‌మాధానం చెప్పారు. మొదట స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి సమంత ఒప్పుకోలేదని, అలాంటి పాటలు నాకు కరెక్ట్‌ కాదేమో అని అనుమానం వ్యక్తం చేశార‌ని సుకుమార్ చెప్పారు. దీంతో తానే స‌మంత‌ని కన్విన్స్‌ చేశాన‌ని చెప్పారు. ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తున్నారు..కాబట్టి ఇబ్బంది ఉండదని స‌మంత‌తో చెప్పానని సుకుమార్ అన్నారు. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇదో కొత్త అనుభవం..నటిగా ఓ సరికొత్త సమంతను చూస్తారు అని చెప్పా. నా మాట మీద నమ్మకంతో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి అంగీకరించింది అని సుకుమార్‌ వెల్లడించారు.

                           
           

About Author