రికార్డు స్థాయిలో వ్యవసాయ గణపతి లడ్డు వేలం పాట
1 min read– వ్యవసాయ గణపతి లడ్డును వేలంపాటలో దక్కించుకున్న వంగల రంగారెడ్డి సభ్యులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గణేష్ లడ్డూ అనగానే అందరికీ పవిత్రమైన ప్రసాదం మహాభాగ్యం మహదానందం అద్భుత అవకాశం అని భావిస్తారు. లడ్డుకు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి.. ఎందుకంటే.. అసలు లడ్డూ వేలం ప్రారంభించినప్పటి నుండి ఉత్కంఠ భరితంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా సాగినది. నందికొట్కూరు పట్టణంలో ని వ్యవసాయ గణపతి కాబట్టి అంతేకాదు.. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పునః ప్రారంభించినందువలన అత్యంత ధర పలుకుతూ పోయినది వ్యవసాయ గణపతి లడ్డూ. లడ్డూ వేలం సెంటిమెంట్ తో కూడుకున్నది.శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో కె.జి. రోడ్డు పక్కన ఎరువుల గోడౌన్స్ దగ్గర ఏర్పాటు చేసిన వ్యవసాయ గణపతి లడ్డూ ఈ ఏడాది వేలంలో రూ.99,999/-(అక్షరాల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే) పలికింది.వేలంపాట నందు లడ్డును దక్కించుకున్న వారు:గౌరవ వంగల రంగారెడ్డి గ్రూప్ రూ.99,999 లు సభ్యులు వంగల రంగారెడ్డి, బుక్కాపురం మురళీధర్ రెడ్డి,పూజారి నాగేశ్వరరెడ్డి, సగినేల అచ్చన్న, పల్లె లక్ష్మన్న,వెంకటరాముడు, అండ్రెడ్డి వెంకట్ రెడ్డి, ఆకుల సుదర్శన్, వెంకటేశ్వర రెడ్డి, కూరగాయల వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, లు వేలం పాటలో వ్యవసాయ వినాయక లడ్డును దక్కించుకున్నారు. వేలం పాటలో మాకా పెద్ద లక్ష్మయ్య, మాకం రమేష్, వరదా నందకుమార్, చిత్రాల వినోద్ కుమార్, మండ్ల వెంకటేశ్వర్లు నాగేళ్ళ రవిశంకర్ , రాయలసీమ ఏజెన్సీస్ తోకల వెంకటరమణ, విశ్వామిత్ర కంపెనీ అధినేతనాగరాజు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ , నందికొట్కూరు పెస్టిసైడ్స్ కంపెనీ ప్రతినిధులు వినోద్ – బయోస్టాట్, రవి – ఇండోఫీల్, యుగంధర్ – మాన్ కైండ్ , నగేష్ – జి.ఎస్.పి, మల్లి – పి.ఐ, నరేష్ – బి.ఏ.ఎస్.ఎఫ్. శివ – యు.పి.ఎల్. తదితరులు పాల్గొన్నారు.