వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి, వ్యవసాయ కూలీలకు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తుందని, కావున వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి డి .రాజా సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పనులు లేక పస్తులు ఉంటున్న వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి ఆదుకోవాలని కోరుతూ, మంగళవారం పత్తికొండ ఎంపీడీవో ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ దస్తగిరికి వినతిపత్రం అందజేశారు.అనంతరం డి రాజా సాహెబ్ మాట్లాడుతూూ, కర్నూలు జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతం పత్తికొండ ప్రాంతంలో వర్షాలు పడక పనులు లేక వ్యవసాయ కూలీలు తీవ్రంగా కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం వేసవిలో ఉపాధి కూలీలకు అంతంత మాత్రం పని కల్పించి పని బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా ఇంతవరకు వర్షాలు పడక వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదన్నారు. వ్యవసాయ కూలీలకు పని లేక అర్ధాకిలతో జీవనం చేస్తూ పస్తులు ఉంటున్నారనీ తెలిపారు. ఉపాధి పని లేక బయట ప్రాంతంలో ఎక్కడ పనులు లేకపోవడం వల్ల వారి కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టలేక కూలీ పనులు దొరకక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని లేనిపక్షంలో ఉపాధి హామీ కూలీల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఎఐటియుసి నియోజక అధ్యక్షు కార్యదర్శులు నెట్టికంటయ్య, రంగన్న, మాదన్న, పట్టణ సహాయ కార్యదర్శి ఎం శ్రీనివాసులు, పెద్ద హుల్తీ శాఖా కార్యదర్శి రాజప్ప, పార్వతి కొండ సిపిఐ శాఖ కార్యదర్శి నాగేంద్రయ్య, భాష, శిఖమణి, ఆంజనేయ, రషీద్ తదితరులు పాల్గొన్నారు.