PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాలాజ‌లంతో ఎయిడ్స్ ప‌రీక్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు ఇప్పటి వరకు రక్తనమూనాలతో మాత్రమే నిర్వహించేవారు. ఇకపై నోటిలోని లాలాజలంతో కూడా నిర్ధారించే వెసులుబాటు కలగనుంది. ఈ పరీక్షల్లో కచ్చితత్వం బాగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అనుమానితులందరికీ ఈ పరీక్షలు సులువుగా అందుబాట్లోకి తెచ్చే యోచనతో.. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సౌజన్యంతో చెన్నైకు చెందిన వలంటరీ హెల్త్‌ సర్వీసెస్‌ ఈ పరీక్షను అందుబాట్లోకి తెచ్చింది. ‘ఓరా క్విక్‌’ హెచ్‌ఐవీ సెల్ఫ్‌ టెస్ట్‌ పేరి ట ఈ పరీక్ష కిట్‌ను రూపొందించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తూ ర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రా రంభించారు. 3 నెలల వ్యవధిలో మొత్తం 2 లక్షల హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

                                             

About Author