PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు సంస్థల అభివృద్ధే లక్ష్యం..

1 min read

– జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఉమాదేవి
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: రైతు సంస్థల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, సేవలు అందిస్తోందని, రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి ఉమాదేవి. మంగళవారం మండల కేంద్రమైన గోనెగండ్ల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శ్రీ నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. కంపెనీ సీఈఓ హరిబాబు, చైర్మన్​ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీ ఎంఐపీ పీడీ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, చైర్మన్​ మాట్లాడుతూ రైతు సంస్థ సాధించిన 10 లక్షల టర్నోవర్ తో 113 మంది రైతులకు టార్పాలిన్లు, 21 మంది రైతులకు బ్యాటరీ , 47పవర్ స్ప్రేయర్లు మంది రైతులకు ఎరువుల వ్యాపార సేవలు అందించినట్లు వారు తెలిపారు. సంస్థ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా 50 లక్షల వ్యాపార టర్నోవర్ లక్ష్యం సాధించి 500 మంది సభ్యులకు పైగా వివిధ ఇన్ పుట్, అవుట్ పుట్ సేవలు అందించి రైతుల ఖర్చును తగ్గిస్తూ ముందుకెళ్లాలని సంకల్పించినట్లు వారు తెలిపారు.

అనంతరం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి ఉల్లి పంట అధిక దిగుబడికి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఏడిహెచ్ రఘునాథ్ రెడ్డి, ఏవో శ్రీమతి ఇందిరా, ఏపీమాస్ డైరెక్టర్ మధుమూర్తి, జాతీయ ఉద్యాన శాఖ పరిశోధన శాస్త్ర సీనియర్ శాస్త్రవేత్త తుషారం అంబే, రైతు సంస్థ పాలకవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, అల్లి పీరా,విరుపాక్షయ్య,రాణి దేవి తదితరులు పాల్గొన్నారు.

About Author