NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీరభద్రస్వామి దేవస్థానంలో  విమాన గోపురం కలశప్రతిష్టాపనోత్సవం..

1 min read

 పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కడప జిల్లా రాయచోటిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో సోమవారం విమాన గోపురం కలశ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలశ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు కల్పించిన మహాభాగ్యమన్నారు.అనంతరం పలు హోమాలు, పూజల కార్యక్రమాల్లో పాల్గోని, విమానగోపురం ప్రారంభోత్సవ శిలఫలాకాన్ని ఆవిష్కరించారు. పదకోండు రోజులపాటు జరిగే వీరభద్రస్వామీ బ్రహ్మాోత్సవాల పోస్టర్ ను  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, అలయ చేర్మేన్ విజయమ్మ, ఈఒ మంజుల లుఆవిష్కరించారు. 20 లక్షలు విలువ చేసే కలశాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చిన కర్ణాటక భక్తుడు బసవరాజును    చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్,  మార్కెట్ చైర్మన్, వైస్ చేర్మేన్లు, కౌన్సిలర్లు, అలయ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author