PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐసా పోరాట ఫలితమే..

1 min read

– తాటిపాడు గ్రామానికి బస్సు సౌకర్యం
– బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఐసా దృష్టికి.
– ఐసా ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కోసం పోరాటం.
– ఆర్టీసీ డిపో మేనేజర్ నాగేశ్వరరావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఐసా జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి.
।– విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో ఐసా ఎప్పుడు ముందుంటుంది.

పల్లెవెలుగు వెబ్ నందికొట్నూరు: జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినందుకు నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ నాగేశ్వరరావుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థి సంఘం (ఐసా) తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి మాట్లాడుతూ తాటిపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు, విద్యార్థులు సరైన సమయంలో పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దృష్టికి రావడంతో ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు, ధర్నాల ద్వారా పోరాటాలు చేయడం జరిగిందన్నారు. నేడ ఎన్నో రోజుల విద్యార్థి పోరాటాల ఫలితంగానే మంగళవారం గ్రామానికి ఉదయం 7.45 , సాయంత్రం 4.45 కు బస్సు సౌకర్యం ఆర్టీసీ అధికారులు కల్పించారని తెలిపారు. గ్రామస్తుల విద్యార్థుల కల నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) ఎప్పుడు ముందుంటుందని అన్నారు. తాటిపాడు గ్రామానికి బస్ సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ నాగేశ్వరరావు అందుకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ ఐసా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి సంఘం నాయకుడు సిద్దయ్య గౌడ్ విద్యార్థిని, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author