ఏ ఐ ఎస్ సి ఆర్ పి ఎస్ కార్యకర్తల సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఎస్సీ ,ఎస్టీ ,సభ్యులతో పరస్పర సహకారంతో ఐక్యమత్యా గా ఉండాలని, ఎస్సి ఎస్టి విద్యార్థుల అభివృద్ధి, అభ్యున్నతికై కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ సభ్యుల విద్యార్థుల బాగోగులుకై, శారీరక సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించుట ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు అన్యాయాలను అరికట్టాలని, ఏ ఐ ఎస్ సి ఆర్ పి ఎస్ కార్యకర్తల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మేకల ముత్తన్న స్థానిక గాంధీనగర్ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్య సాంఘిక సాంస్కృతిక విషయాల్లో ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి పదం వైపు నడిపించుట నిమ్న జాతుల వారి అభివృద్ధికై పాటుపడి మిగతా రాజకేయతర సంస్థలకు అన్నింటిని ఒకే వేదిక రూపొందించడం మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుటకు కార్యక్రమాలు చేపట్టడం బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను వ్యాపింప చేయలని అన్నారు. తదనంతరం పి.జగన్నాథ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అన్ని భాగాలలో సంస్థ యొక్క శాఖలను నెలకొల్పాలని సభలు సమావేశాలు ద్వారా సాంఘిక సాంస్కృతిక సలహాలు కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం, సాంఘిక ఆర్థిక విషయాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జాగృతిని కలుగజేయలని ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఎం. మస్తాన్ రావు మాట్లాడుతూ కులాంతర ఉప కులాలలో వివాహములకు సోదర భావాన్ని ప్రోత్సహించడం ,బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలను, ప్రాంతీయ భాషలోనికి అనువదించుటం మరియు వారపత్రికలో ప్రచు రించడం సహకార స్ఫూర్తిని పెంపొందించి కో-ఆపరేటివ్ సొసైటీలను స్థాపించి ఆర్థిక అభివృద్ధికై కృషి చేయడం అలాంటి కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.