PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28 నుంచి ఏఐఎస్​ఎఫ్​ జాతీయ మహాసభలు

1 min read

జయ ప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ పిలుపు

హొళగుంద ,పల్లే వెలుగు;  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (𝐀𝐈𝐒𝐅) 30వ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 28.నుండి అక్టోబర్ 01తేదీ వరకు బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ లో జరుగు 30వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్​ఎఫ్​ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ పిలుపునిచ్చారు.  మంగళవారం జాతీయ మహాసభలకు సంబందించిన కరపత్రాలను ఇంగళదహాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో  కలిసి  ఆయన విడుదల చేవారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తనకి చేసి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది భోజనాల గురించి విద్యార్థులను విచారించగా విద్యార్థులు మేము ప్రకారంగా మాకు ప్రతిరోజు భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది విద్యార్థులకు యువకులకు వరాల జల్లులు  కురిపించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతిబీరకాయలో నెయ్యి రుచి చూడమన్న చందంగా మళ్లీ మన ప్రభుత్వం రావాలి అంటున్నారు.నాడు-నేడు అభివృద్ధి పనులతో ప్రజాధనాన్ని ఆర్భాటంగా ఖర్చు చేసి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా జీవో నెంబర్ 117 తో రాష్ట్రంలో వేలాది ప్రాథమిక పాఠశాలలను విలనం చేసింది అందువలన రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యకు దూరమయ్యారు మరోపక్క కేంద్రమంత్రి పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రంలో 50వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దీనివల్ల ఏక ఉపాధ్యాయ పాఠశాలలో అవతరించాయి అంతేకాక విద్యా సంవత్సరం ముగుస్తున్న ఇంకా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు అందించలేని పరిస్థితి  ఉపాధ్యాయులను నియమించలేదు. ఈ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం. అమ్మ ఒడి గోరుముద్దలు జగనన్న విద్య కానుక వసతి దివెన విద్య దివేన ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అనేక రకాల ఆకాంక్షలు షరతులు పెట్టి చదువుకు దూరం చేస్తున్న విద్యార్థుల పైన సవతతల్లి ప్రేమ చూపిస్తుంది ప్రైవేట్ విద్యాసంస్థలలో  PG.MCA.MBA.M.CO.M.SC.చదువుతున్న విద్యార్థులకు జీవో నెంబర్  77 తీసుకొచ్చి ఫీజురియంబర్మెంట్ అందించకుండా మోసం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఐదు మెడికల్ కళాశాలలో జీవో నెంబర్ 107.108 తీసుకువచ్చి 50% మాత్రమే కన్వీనర్ కోటలో సీట్లు భర్తీ చేసి మిగతా సీట్లను B.C కేటగిరీలో భర్తీ చేస్తామని చెప్పటం వలన పేద మెరిట్ విద్యార్థులు విద్య వైద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఐటిఐ పాలిటెక్నిక్ బిటెక్ డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని అలాగే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) పోరుకు సిద్ధమవుతుందని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో AISF మండల ఉపాధ్యక్షులు అజయ్ విద్యార్థులు నరసింహ రమేష్ అనిల్ రెహమాన్ నవీన్ శరత్ బాబు శేఖర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

About Author